Nsnnews// కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యదేచ్చగా లింగ నిర్ధారణ చేస్తున్న ముఠా పై హెల్త్ ఆఫీసర్లు, పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందులొ బాగంగా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ఓ కారులో లింగ నిర్ధారణ చేసే సోనోగ్రఫీ యంత్రం ఉన్నట్లు సమాచారంతో పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కారును తనిఖీ చేయగా ఇట్టం సిద్ధరాములు కు సంబంధించిన కారులో లింగ నిర్ధారణ యంత్రం లభించింది. దాంతో ఇట్టం సిద్ధరాములను విచరించగా అశోక్ నగర్ కాలనీలోని తన ఇంట్లో మరో యంత్రం లభించింది. రెండు లింగ నిర్ధారణ చేసే యంత్రాలను పోలీసులు, డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇట్టం సిద్ధరాములకు నోటీసు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్ వెల్లడించారు.
Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…