Nsnnews// ప్రముఖ ఐఐటీ బాంబే విద్యాసంస్థకు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. విద్యాసంస్థ అభివృద్ధి కోసం.. దాదాపు 130 కోట్ల రూపాయల భూరి విరాళం ఇచ్చింది. ఈ మేరకు ఐఐటీ బాంబే ప్రతినిధులకు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ ప్రతినిధులు చెక్కును అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను MOFSL సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకుంది. ఐఐటీ బాంబేలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ను మరింతగా మెరుగుపరిచేందుకు ఆర్థికసాయం అందించినట్లు పేర్కొంది. దేశంలోని విద్యా సంస్థలకు ఇచ్చిన అతి పెద్ద కార్పొరేట్ విరాళాల్లో ఇది ఒకటని రాసుకొచ్చింది. ఐఐటీ బాంబేలో మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ఇది తోడ్పడనుందని వివరించింది. మోతీలాల్ ఓస్వాల్ సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా UG,PG,ప్రొఫెషనల్ లెర్నర్ల కోసం.. పలు రకాల అకెడమిక్ ప్రోగ్రామ్ లను అందించనున్నట్టు తెలిపింది.
Latest news,Telugu news,National news