Nsnnews// హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే..లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ మురుగురహిత నగరంగా మార్చే ప్రయత్పం చేశారని…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ ఎస్టీపీను..పార్టీ నేతలతో కలిసి సందర్శించారు కేటీఆర్. కేసీఆర్ దృఢ సంకల్పం, ఆశీర్వాదంతో..stpలను సందర్శించే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. తమ పార్టీల నేతలతో కలిసి చేసిన ఎస్టీపీల సందర్శనల్లో.. ఇది మొదటి అడుగు మాత్రమే అని పేర్కొన్న కేటీఆర్… మిగిలిన ఎస్టీపీలను కూడా సందర్శించనున్నట్టు చెప్పారు. నగరంలోని 94 శాతం స్వచ్ఛమైన నీరు.. మూసీలోకి వెళ్తున్నప్పుడు శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టు కోసం లక్షన్నర కోట్లు ఖర్చు చేయడం..వృధా అన్నారు.
Latest news,Telugu news,Telangana news