Nsnnews// కొల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జరిగిన మెడికల్ విద్యార్థి ఆత్యచార ఘటన.. దేశ వ్యాప్తంగా దూమారం రేపింది. ఈ ఘటనపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో తీవ్రంగా నిరసన తెలిపారు. వారి నిరసనకు సీఎం మమతా బెనర్జీ దిగి వచ్చిన వారి కోపం తగ్గలేదు.
కొల్‌కతా డాక్టర్ అత్యాచార ఘటనలో తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ జూనియర్ వైద్యులు నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షకు సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు తమ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్ వైద్యులు నిరాహార దీక్షల్లో పాల్గొని.. సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం వీరు వారి రాజీనామ పత్రాలపై సంతకం చేస్తున్న వీడియో నెటింట్లో ట్రెండింగ్‌గా మారింది. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన 12 గంటల నిరాహారదీక్షను జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. వారిలో ఆరుగురు నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటారని ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ మార్చ్‌కు పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదని సమాచారం.
Latest news,Telugu news,National news