Nsnnews// కామారెడ్డి జిల్లా రాఘవపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 13/1లో ముత్యంపేట్ గ్రామానికి చెందిన శిరీష్ గౌడ్ 3 ఎకరాల భూమిని కబ్జా చేశాడని చింతామన్ పల్లి గ్రామానికి చెందిన రావుల రాజేశ్వర్ గౌడ్, రావుల మల్లికార్జున గౌడ్, రావుల లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు 1970 సంవత్సరంలో సర్వేనెంబర్ 13/1 లో గత 54 సంవత్సరాల క్రితం మా తాత లింగ గౌడ్ పేరుపైన 3 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చారని ఇచ్చినప్పటినుండి ఇప్పటివరకు అదే స్థలంలో ముగ్గురు అన్నదమ్ములం కలిసి పంట పండించుకోని బతుకుతున్నామని అన్నారు, శిరీష్ గౌడ్ మా భూమి పక్కన వేరే వాళ్ల దగ్గర భూమి తీసుకొని అదే చనువు చేసుకొని పక్కన ఉన్న మాభూమిలో నెంబర్ లేని జెసిబితో బ్లేడ్ పెట్టి చదును చేసి కడీలు పాతడం జరిగిందని, మాభూమిలో ఒక డబ్బా ఏర్పాటు చేసి అందులో లిక్కర్దండ చేస్తున్నాడని అన్నారు.ఇది మా భూమి అని వెళ్తే కొంతమంది మైనార్టీ మహిళలను రౌడీ షీటర్లను తీసుకువచ్చి వారితో కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడని , ఇట్టి విషయం పైన జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు చెప్పిన కూడా పట్టించుకోవడంలేదని , అదేవిధంగా ఆర్డీఓ ,ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగిందని వారు కూడా పట్టించుకోవడంలేదని కామారెడ్డిలో అతనికి కొన్ని వైన్సులు ఉన్నాయని డబ్బు ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడని ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని గత 74 సంవత్సరాలుగా ఇదే భూమిలో ఉండడం జరుగుతుందని, కావాలంటే మా గ్రామానికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారని70 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త పాస్ బుక్ ఉందని, అధికారులు పట్టించుకోని మాకు న్యాయం చేయగలరని కోరారు.
Latestnews, Telugunews, Telangananews, Kamareddynews…