Nsnnews// ముడా కుంభకోణం కేసులో.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్యపై చర్యలు తీసుకున్నారు.
సీఎం కుటుంబానికి MUDA స్థలం కేటాయింపు వ్యవహారంపై.. గవర్నర్ విచారణకు ఆదేశించడాన్ని ఇటీవల హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత ప్రత్యేక కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 156(సీ) కింద విచారణ చేపట్టాలని..డిసెంబర్ 24లోపు దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యతో పాటు.. ఆయన భార్య పార్వతి, ఆయన బంధువులు మల్లికార్జున స్వామి, దేవరాజు పలువురి పేర్లను చేర్చారు. కాగా, ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. పార్టీ సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇక సీఎం రాజీనామా చేయాలంటూ చేస్తున్న డిమాండ్లపై మాట్లాడిన ఖర్గే..ఈ కేసులో ఛార్జ్‌షీటు కానీ దోషిగా తేలడం గానీ జరగలేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తామన్నారు. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు.. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కూడా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఖర్గే గుర్తుచేశారు.ముఖ్యమంత్రిగా కొనసాగడం సిద్ధరామయ్య నైతిక హక్కు అని అన్నారు.
ఇదిలా ఉండగా… సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతిని వెనక్కి తీసుకున్న.. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా మల్లికార్జున ఖర్గే సమర్థించారు. ఆ నిర్ణయాధికారం తమ పరిధిలోనే ఉందన్నారు. దీంతోపాటు, సీబీఐ పలు కేసుల్లో పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇలా అనుమతి వెనక్కి తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదన్న ఖర్గే.. దేవరాజు సీఎంగా ఉన్నప్పుడు, సీబీఐని దుర్వినియోగం చేసినప్పుడు కూడా ఇలాగే అనుమతిని వెనక్కి తీసుకున్నారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు…వందల మంది మరణానికి కారణమైన వీరప్పన్ కేసు, స్టాంప్ పేపర్ వెండర్ తెల్గితో పాటు.. మరో కేసు సీబీఐకి రిఫర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ కేసుల్లో దర్యాప్తులు సవ్యంగానే కొనసాగున్నాయని…తాము ఆ కేసులు తీసుకోమని సీబీఐ చెప్పిందని ఖర్గే అన్నారు.
Latest news,Telugu news,National news,Politics news