Nsnnews// మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో జిల్లా స్థాయి యోగాసన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా సుమారుగా 183 క్రీడాకారులు పాల్గొన్నట్టు యోగాసన జిల్లా అధ్యక్ష గణేశ్, కార్యదర్శులు రవికుమార్, భుజగేందర్ రెడ్డి తెలిపారు. ఈ యోగాసన పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. సబ్ జూనియర్ బాలికల ట్రెడిషనల్ యోగా విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసినట్టు తెలిపారు. అలాగే.. ఆర్టిస్టిక్ యోగా పెయిర్ విభాగంలో కూడా ముగ్గురిని ఎంపిక చేసినట్టు చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Medak District