Home బ్రేకింగ్ ముంచుకొస్తున్న అల్పపీడనం || cyclone alert heavy rain forecast in Andhra pradesh

ముంచుకొస్తున్న అల్పపీడనం || cyclone alert heavy rain forecast in Andhra pradesh

0
ముంచుకొస్తున్న అల్పపీడనం || cyclone alert heavy rain forecast in Andhra pradesh

 

Nsnnews// అల్పపీడనం ముంచుకొస్తుంది. బలమైన అల్పపీడనంగా ఏర్పడి…వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా వెళ్లి, మంగళవారానికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఇది ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 24 నాటికి ఒడిశా-బంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 24, 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈదురుగాలులు వీస్తాయని, జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించారు.

Latest news,Telugu news,Andhra pradesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version