Nsnnews// మిరుదొడ్డి మండల నూతన తహసిల్దారుగా హరికిషన్ బాధ్యతలు చేపట్టారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్. ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన గోవర్ధన్ హైదరాబాద్ కు బదిలీపై వెళ్లడంతో, డిప్యూటీ తాసిల్దారుగా పనిచేస్తున్న వీరేశంకు బాధ్యతలు అధికారులు అప్పగించారు. ఇటీవల జరిగిన బదిలీలో సిద్దిపేట రూరల్ తహసిల్దార్ గా పని చేసిన హరికిషన్ కు మిరుదొడ్డి తహసిల్దార్ గా నియమించారు. నేడు తాసిల్దారుగా హరికిషన్ బాధ్యతలు తీసుకోవడంతో రెవెన్యూ సిబ్బంది తహసిల్దార్ కు పుష్పగుచ్చమిచ్చే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలవ్యాప్తంగా ఏవైనా భూ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి, ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ వీరేష్, ఆర్ ఐ రాజ్కుమార్, కొండల్ రెడ్డి,సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
Latestnews, Telugunews, Telangananews, Siddipetnews…