Nsnnews// సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో.. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాబు మాట్లాడారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో..చెరుకు ముత్యంరెడ్డి పాల్గొలేదన్నారు. అనుచరులతో బెదిరింపులకు పాల్పడితే..తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని..చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో..కంచెలు వేసి అడ్డుకున్న చరిత్ర..బీఆర్ఎస్‌కు ఉందన్నారు. బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణాలపై..తాము చర్చకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.
ప్రజా సమస్యలపై మాట్టాడకుండా..వ్యక్తిగత విషయాల్లో తలదూర్చితే సహించబోమన్నారు. కార్యక్రమంలో..బీఆర్ఎస్ నాయకులు మొగుళ్ళ ఐలయ్య , నక్కసాయి, ఎర్రోళ్ల నర్సింలు, ధర్మారం నర్సింలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news