Nsnnews// కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ సమక్షంలో హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో దేశ భద్రత కోసం పనిచేసేందుకు అహర్నిశలు కృషిచేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.
కాగా.. బండి సంజయ్ కుమార్.. 2019లో తొలిసారిగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. తరువాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ విస్తరణకు చర్యలు తీసుకున్నారు. 2020 మార్చి 11 నుంచి 2023 జులై 3వ వరకు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం BJP జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్నారు.
Latestnews, Telugunews, Karimnagar, Bandi Sanjay…