Nsnnews// AP ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం
ఇబ్రహీంపట్నం మండలం తుమ్మల పాలెం గ్రామానికి చెందిన మహిళ ఇబ్రహీంపట్నం లోని వి టి పిఎస్ కెనాల్ లో దూకి ఆత్మ హత్యాయత్నం చేశారు.అటుగా వెళ్తున్న ఇబ్రహీంపట్నం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడు రవిదత్తా మహిళ కాలువలో దూకడం గమనించి ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తోన్న కాలువలో దూకి ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేసిన అర్చకుడు రవిదత్తా ను స్థానికులు ప్రశంసించారు.మహిళ ఆరోగ్యం పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది.