Nsnnews// చెన్నై సమీపంలోని తొరయ్ పక్కం ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మణికందన్ అనే యువకుడు బాధితురాలిని హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. మృతదేహం భాగాలను సూట్ కేస్ లో ఉంచి నిర్మాణంలో ఉన్న ఒక భవనం సమీపంలో పడేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు సూట్ కేస్ ను స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. రెండు రోజుల నుంచి తన చెల్లెలు కనిపించడం లేదని బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొరాయపక్కంలో చివరగా ఫోన్ లోకేషన్ ను గుర్తించానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ అనంతరం పోలీసులు మణికందన్ అనే నిందితుడిని పట్టుకున్నారు. స్నేహితుడి ద్వారా బాధితురాలి ఫోన్ నంబర్ తెలుసుకొన్న నిందితుడు.. ఆమెను తన నివాసానికి ఆహ్వానించాడని పోలీసులు తెలిపారు. డబ్బుల విషయంలో ఇద్దరికి గొడవ జరిగిందని చెప్పారు. ఆ కోపంలోనే నిందితుడు, బాధితురాలని హత్య చేశాడని వెల్లడించారు.
Latest news,Telugu news,Crime news