Home పాలిటిక్స్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గందరగోళం || Maharashtra assembly elections are in chaos…

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గందరగోళం || Maharashtra assembly elections are in chaos…

0
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గందరగోళం || Maharashtra assembly elections are in chaos…

 

Nsnnews// మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల అంశంలో….కాంగ్రెస్- శివసేన UBT మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ హస్తం పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రమేష్ చెన్నితాల… మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, NCP అధినేత శరద్ పవార్ తో సమావేశమై, సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. శరద్ పవార్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకే.. ఆయన్ను కలిసినట్టు సమావేశం తర్వాత రమేష్ చెన్నితాల తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, శివసేన UBT నేత సంజయ్ రౌత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ల పంపకాలు కొలిక్కి వస్తాయని తెలిపారు. మరోవైపు..ఇండియా కూటమికి చెందిన సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్రలో ఐదు చోట్ల తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 12 స్థానాల్లో పోటీ చేయాలని ఎస్పీ భావిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని.. మహాయుతి కూటమి కూడా సీట్ల పంపకాలను ప్రకటించాల్సి ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 23న ఓట్లు లెక్కించనున్నారు. ఇవాళ్టీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

Latestnews, Telugunews, Maharastra Assembly Elections, Congress, Shivasena..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here