Nsnnews// ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తమ పంటలు ధ్వంసమై… ఆస్తి నష్టంతో సర్వం కోల్పోయామని మహబూబాబాద్ జిల్లా వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకి నష్ట పరిహారం అందించాలని రావిరాల గ్రామ ప్రజలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉపాధి లేక బతుకులు భారమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యవసర సరుకులు అందించాయని…. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ పరిహారం అందలేదని వాపోయారు.
Latest news,Telugu news,Mahbubabad District,Telangana news