Nsnnews// తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన రాజ్ తరుణ్-లావణ్య లవ్ ఎపిసోడ్‌లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది.టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. లావణ్య ఫిర్యాదుపై రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేశారు. 2008 నుంచి రాజ్ తరుణ్‌తో పరిచయం ఉందని, 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో లావణ్య తెలిపింది. 2016లో గర్భం దాలిస్తే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది.
Latestnews, Telugunews, Lavanya Rajtharun Case..