Nsnnews// ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జుడిషియల్ కస్టడీని వారం రోజులు పొడిగిస్తూ.. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ రోజు న్యాయమూర్తి ముందు మనీష్ సిసోదియా హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 22న జరుగుతుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోదియా, ఢిల్లీ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రితోపాటు ఎక్సైజ్ మినిస్టర్ కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో 2023 ఫిబ్రవరిలో ఆయనను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కారణంగా ఆయన ఫిబ్రవరి 28, 2023న మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత మార్చి 2023లో ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని అభియోగాలు మోపుతూ ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు..
2021-22 సంవత్సరంలో ఢిల్లీ రాష్ట్ర పరిధిలో లిక్కర్ షాపులకు లైసెన్స్ ఇచ్చేందుకు కొందరు మంత్రులు లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. దీంతో ఈ కొత్త మద్యం పాలసీని ఢిల్లీ గవర్నర్ రద్దు చేసి.. సిబిఐ, ఈడీ అధికారులకు పిఎంఎల్ఏ చట్టం కింద విచారణ జరిపేందుకు ఆదేశాలిచ్చారు.
ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సత్యేంద్ర జైన్, మనీస్ సిసోదియా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత జైల్లోనే ఉన్నారు.
Latest news,Telugu news,national news…