20-04-2024 శనివారం రోజున సాయంత్రం సుమారు 5 గంటల సమయం లో సత్తుపల్లి పట్టణంలోని పాత సెంటర్లో ఒక కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ హల్చల్ చేశాడు. పట్టణంలోని పాత సెంటర్ లో ఎదురుగా వస్తున్న బైక్ ను, ట్రాలీ ఆటోను కార్ తో ఢీ కొట్టి అంతటితో ఆగకుండా విద్యుత్ స్తంభాన్ని కూడ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళలకు గాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. అతిగా మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు నడపడం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ప్రమాదానికి కారణమైన మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. వాహనాలను తీసివేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.