Nsnnews// కర్నూలు – అవుకు మండలం సింగనపల్లికి చెందిన లారీ డ్రైవర్ డ్యూటీ దిగి ఫుల్లుగా మద్యం సేవించాడు. మద్యం బాగా ఎక్కడంతో ఇంటికి వెళ్లలేక.. ఓ చోట అరుగుపై కూర్చున్నాడు. మద్యం మత్తులో తూగుతూ ఉండిపోయాడు. అయితే పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ కొండ చిలువ.. సదరు వ్యక్తి మీదకు ఎక్కిన అతనికి ఏమీ తెలియలేదు. కొంతసేపటికి కొండచిలువతో ఉన్న లారీ డ్రైవర్‌ను చూసిన స్థానికులు.. కట్టెల సహాయంతో పక్కకు లాగేశారు. ఒంటిపై కొండచిలువ నాట్యం చేస్తున్నా లారీ డ్రైవర్‌కు స్పర్శ తెలియకపోవడంతో ఇలా ఉన్నాడేంటి అంటూ గ్రామస్తులు నవ్వుకున్నారు.
Latest news,Telugu news,Andhra Pradesh news