Nsnnews// ముంబయి: గురువారం సరికొత్త రికార్డులను అధిగమించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 210 పాయింట్ల నష్టంతో 79,032 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 33.90 పాయింట్ల నష్టంతో 24,010 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నిన్నటి లాభాల జోరును కొనసాగిస్తూ ఉదయం మార్కెట్లు ఉత్సాహంగా ఆరంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 79,496 పాయింట్లు లాభపడి సరికొత్త గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ సైతం 74 పాయింట్ల లాభంతో 24,120 పాయింట్లకు పైనే ట్రేడింగ్‌ను కొనసాగించింది. మధ్యాహ్నం 12 గంటల వరకూ సానుకూలంగా కదలాడిన సూచీలు మదుపరులు జాగ్రత్త చర్యలకు దిగి, లాభాల స్వీకరణ మొదలుపెట్టడంతో పడుతూ లేస్తూ కదలాడాయి. చివరకు నష్టాలతో ముగిశాయి.
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ లైఫ్ టాటా మోటార్స్ తదితర షేర్లు లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్ర బ్యాంకు తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా హెల్త్‌కేర్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ రంగ షేర్లు పుంజుకోగా, బ్యాంకింగ్ ఇండెక్స్ 1శాతం తగ్గింది. అలాగే మూలధన వస్తువుల ఇండెక్స్ 0.4శాతానికి పడిపోయింది.
Latest news,Telugu news,Business News, Nifty ,Sensex, Stock Market…