Nsnnews// హైదరాబాద్: మందుబాబులకు బిగ్ అలర్ట్. అయితే బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా. అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. విధులు మగించుకుని ఇంటికి వెళ్తూనో.. స్నేహితులతో సరదాగా మందు తాగుదామని అనుకుంటున్నారా.. అయితే జరజాగ్రత్త. ఇంట్లోనే లేదా బార్‌లోనే కూర్చుని మద్యం సేవించండి. అలాకాదని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పోలీసుల కంట పడ్డారో ఇక అంతే సంగతి. మీకు ఆరు నెలల జైలుశిక్ష తప్పదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నేరమంటూ హెచ్చరిస్తూ పోలీసు శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ప్రజలకు, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా రోడ్లపై కానీ, ఖాళీ ప్రవేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ నేరానికి 6 నెలల వరకు జైలు శిక్ష పడుతుంది’ అంటూ ట్వీట్ చేసింది. ఇలాంటి ఘటనలపై డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించింది.
Latest news,Telugu news,Big alert, Drink alcohol at home or at a bar…