Nsnnews//తూర్పు ఆఫ్రికా దేశాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా టాంజానియా, కెన్యా, బురుండిలో వరదలు సంభవించాయి. దీంతో ఆయా దేశాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. అనేక ప్రధాన నదులు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా టాంజానియాలో 155 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని కాసిమ్ మజలివా ఇటీవల వెల్లడించారు.