Nsnnews// దేవభూమిలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా చాదర్ యాత్రను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్‌లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో భక్తులందరూ రుషికేశ్ దాటి చార్ ధామ్ యాత్రకు వెళ్లవద్దని అభ్యర్థించారు. ఇప్పటికే యాత్రకు వెళ్లిన వారు తమ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు వాతావరణం అనుకూలించే వరకు ఎక్కడున్నా వారు అక్కడే వేచి ఉండాలని ఆయన సూచించారు. కాగా గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయని, కొండలపై నుంచి పడిన శిథిలాల కారణంగా బద్రీనాథ్‌కు వెళ్లే రహదారులు మూసుకుపోయిట్టు సమాచారం. చమోలి జిల్లాలోని కర్ణప్రయాగ్ లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించారు. బద్రీనాథ్ నుంచి మోటార్ సైకిల్‌పై తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ్‌లో అలకనంద ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది.
Latestnews, Telugunews, Chadar Yatra, Heavy Rains…