Nsnnews// వాషింగ్టన్:రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంపై ఆందోళనలు ఉన్నప్పటికీ..భారత్‌తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది.ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతోకాలంగా ఉన్నవేనని గుర్తుచేసింది.ఉక్రెయిన్ సంక్షోభం వేళ ప్రధాని నరేంద్రమోదీ మాస్కో పర్యటనను పాశ్చాత్యదేశాలు ఆసక్తిగా గమనించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖలు స్పందించాయి.
‘‘భారత్,రష్యాల మధ్య చాలాకాలంగా ద్వైపాక్షికసంబంధాలు ఉన్నాయి.అమెరికా కోణంలో చూస్తే..భారత్ వ్యూహాత్మక భాగస్వామే.రష్యాతో వారి సంబంధాలపై మాకు పూర్తి స్పష్టత ఉంది.ఈ వారం నాటో శిఖరాగ్ర సదస్సు జరగనున్న వేళ..మోదీ పర్యటన చేయడంపై యావత్ ప్రపంచం దృష్టి పెట్టింది’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలతో తాము దూరం కాలేదని ఈ పర్యటన ద్వారా పుతిన్ ప్రకటించుకున్నా అందులో ఆశ్చర్యం లేదని ప్యాట్ రైడర్ అభిప్రాయపడ్డారు. యుద్ధానికి వెళ్లాలనే నిర్ణయమే రష్యాను ప్రపంచానికి దూరం చేసిందన్న ఆయన..దానివల్ల రష్యా ఎంతో మూల్యం చెల్లిస్తోందన్నారు.ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించి కేవలం రష్యాతోనే కాకుండా జెలెన్‌స్కీతోనూ ఇటీవల మోదీ మాట్లాడారని,శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందనే భరోసా కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
రష్యాతో భారత్ సంబంధాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ వాటిపై తమకు స్పష్టత ఉందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.ఆ రెండు దేశాల మైత్రి కొనసాగింపుపై తమ ఆందోళనలను భారత్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని అన్నారు. రష్యాతో భారత్‌కు ప్రత్యేకమైన, వ్యూహాత్మకమైన భాగస్వామ్యం ఉన్న విషయం తెలిసిందే.
Latestnews, Telugunews, Washington, ndia-Russia relations…