Nsnnews// బ్రిటిష్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్ పార్టీ భారీ విజయం సాధించింది. 650 సీట్లున్న పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 341 సీట్లకు పైగా గెల్చుకున్నారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని 14 ఏళ్ల ప్రభుత్వ పాలనకు తెరపడింది. జూలై 4న జరిగిన ఓటింగ్ ఫలితాలు ఈరోజు ఉదయం వెలువడ్డాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక భారత సంతతికి చెందిన కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌కు ఇప్పటివరకు 72 సీట్లు మాత్రమే వచ్చాయి. సునాక్ తన రిచ్‌మండ్, నార్తలెర్టన్ స్థానాలను గెలుచుకున్నారు.
లేబర్ పార్టీ PM అభ్యర్థి కైర్ స్టార్మర్ లండన్‌లోని హోల్‌బోర్న్, సెయింట్ పాన్‌క్రాస్ స్థానాలను కూడా గెలిచారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత, సునాక్ తన ఓటమిని అంగీకరించారు. బ్రిటన్ ప్రజలు వారి తీర్పును ఇచ్చారని, దాని నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని సునాక్ అన్నారు. దీనికి బాధ్యత వహిస్తానని, కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే స్టార్మర్‌కు ఫోన్ చేసి విజయంపై అభినందనలు తెలియజేశారు. 2019లో 67.3% ఓటింగ్ నమోదైంది. అప్పుడు సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి 365 సీట్లు, కైర్ స్టార్మర్స్ లేబర్ పార్టీకి 202 సీట్లు, లిబరల్ డెమోక్రాట్లకు 11 సీట్లు వచ్చాయి. ఈసారి దాదాపుగా అన్ని సర్వేలు కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూశాయి. YouGov సర్వేలో, లేబర్ పార్టీకి 425 సీట్లు, కన్జర్వేటివ్‌లకు 108, లిబరల్ డెమోక్రాట్‌లకు 67, SNPకి 20 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Latestnews, Telugunews, UK Elections, rishi sunak, keir starmer…