‘బ్యాంకుల్ని దోపిడీ చేసిన నేతకు చిరంజీవి మద్దతు’
చిరంజీవిపై తాను అవమానకరంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలంటే ఇది కాదు పద్దతి అని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమి అధికారంలోకి రావాలని చిరంజీవి భావిస్తున్నారని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల్ని దోపిడీ చేసిన నేతకు చిరంజీవి మద్దతు పలికారని సజ్జల ఆరోపించారు. ఒకే స్వభావం ఉన్నవారంతా ఒకే గూటికి చేరుతారని సజ్జల అన్నారు.