Nsnnews// రెండేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని బోరుతో..నీటీ కష్టాలు ఎదుర్కొంటున్నామని..సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి 2వ వార్డు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు మరమ్మత్తుల పేరిట..గత రెండు సంవత్సరాలుగా అధికారులు, పాలకులు చొద్యం చూస్తున్నారని ఆరోపించారు. కాలనీలో నీటి సరఫరా సరిగ్గా లేక.. అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు బాధ వెల్లడించారు. గతంలో పాడైపోయిన బోరు..ప్రత్యేక అధికారుల పాలనలో మరమ్మత్తులకు నోచుకుంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. వెంటనే మరమ్మత్తులు చేపట్టి..నీటీ కష్టాలను తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news