Home అంతర్జాతీయం బైడెన్‌ వైదొలగాల్సిందే

బైడెన్‌ వైదొలగాల్సిందే

0
బైడెన్‌ వైదొలగాల్సిందే

 

Nsnnews// వాషింగ్టన్‌: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో అట్లాంటాలో ఇటీవల జరిగిన సంవాదంలో పలుమార్లు తడబడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ దఫా ఎన్నికల బరి నుంచి వైదొలగాలన్న డిమాండ్లు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. పాలక డెమోక్రటిక్‌ పార్టీలోని పలువురు కీలక నాయకులతోపాటు కొన్ని ప్రముఖ వార్తాసంస్థలూ ఇదే వాణి వినిపిస్తున్నాయి. ‘‘దేశానికి సేవ చేయాలంటే, అధ్యక్ష పదవి రేసు నుంచి బైడెన్‌ వైదొలగాలి. ఈ దఫా ఆయన డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కొనసాగడంలో హేతుబద్ధత ఏమీ లేదు’’ అని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ‘‘డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసు నుంచి బైడెన్‌ను తప్పించడం అత్యంత దేశభక్తితో కూడిన ఐచ్ఛికం’’ అని ‘ది అట్లాంటిక్‌’ పేర్కొంది. బైడెన్‌ మాత్రం.. తాను పోటీలో కొనసాగనున్నట్లు తాజాగా న్యూజెర్సీలో తన మద్దతుదారులతో మాట్లాడుతూ పునరుద్ఘాటించారు. మరోవైపు- ట్రంప్‌తో సంవాదం అనంతరం స్వతంత్ర ఓటర్లలో 10% మంది బైడెన్‌ వైపు మొగ్గుచూపారని ఓ సర్వేలో తేలినట్లు అధ్యక్షుడి బృందం పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధులు షికాగోలో ఆగస్టు 19-22 మధ్య భేటీ కానున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలంటే 1,975 మంది డెలిగేట్ల మద్దతు అవసరం కాగా.. బైడెన్‌కు 3,894 మంది మద్దతు ఉంది.

Latest news,Telugu news,International,USA…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here