Home తెలంగాణ బీహార్‌లో “జీవిత్ పుత్రిక” వేడుకలో విషాదం || Tragedy in Bihar’s “Jeevit Putrika” celebration…

బీహార్‌లో “జీవిత్ పుత్రిక” వేడుకలో విషాదం || Tragedy in Bihar’s “Jeevit Putrika” celebration…

0
బీహార్‌లో “జీవిత్ పుత్రిక” వేడుకలో విషాదం || Tragedy in Bihar’s “Jeevit Putrika” celebration…

 

Nsnnews// బిహార్ లో ఆనందాన్ని పంచాల్సిన వేడుక…పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రాష్ట్రవ్యాప్తంగా “జీవిత్ పుత్రిక” వేడుక సందర్భంగా జరిగిన వేరువేరు ఘటనల్లో…46 మంది మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మృతుల్లో 37 మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం పండుగ వేళ…15జిల్లాల్లో నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు చేస్తున్న క్రమంలో…ఈ దుర్ఘటనలు జరిగినట్టు చెప్పారు. ఇప్పటివరకూ 43 మృతదేహాలను వెలికితీసినట్టు పోలీసులు వెల్లడించారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. దీనిపై స్పందించిన బిహార్ CM..మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. “జీవిత్ పుత్రిక” పర్వదినాన…ఉపావాస దీక్ష ఉండి…తమ పిల్లలతో కలిసి నదుల్లో స్నానం చేస్తే…చిన్నారులు క్షేమంగా ఉంటారని మాతృమూర్తులు భావిస్తారు.

latestnews, telugunews, Bihar, “Daughter of Life” celebration, 46 members Died…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version