Home తెలంగాణ బీసీ మంత్రి సురేఖపై దాడి హేయనీయం || The attack on BC Minister Surekha is despicable

బీసీ మంత్రి సురేఖపై దాడి హేయనీయం || The attack on BC Minister Surekha is despicable

0
బీసీ మంత్రి సురేఖపై దాడి హేయనీయం || The attack on BC Minister Surekha is despicable

 

Nsnnews// బీసీ మహిళా మంత్రి అయిన కారణంగానే…కొండా సురేఖపై పదేపదే దాడులు జరుగుతున్నాయని…బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్ అన్నారు. సురేఖపై దాడులు జరగడాన్ని ఆయన ఖండించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జరిగిన బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ,‌ సినిమా రంగంలోని ఆధిపత్య కులాలు ఉద్దేశపూర్వకంగానే… బీసీ మహిళా మంత్రి కొండా సురేఖపై రాజకీయ దాడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, బిజెపి, ఎంఐఎంలు.. ప్రజా సమస్యలను గాలికొదిలేసి హైడ్రా, మూసీ చుట్టూ తిరుగుతున్నాయని… బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కుల జనగణన జరిపి చట్టసభల్లో.. బీసీలకు జనాభా ప్రకారం వాటా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను.. పర్మినెంట్ చేసి, కనీస వేతనంగా 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసిద్ది రాములు.

Latest news,Telugu news,Telangana news,Kamareddy news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here