Nsnnews// బీసీల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తన కార్యవర్గంలో 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతురావు ఆధ్వర్యంలో.. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘనంగా సన్మానం జరిగింది. ఇందులో మంత్రులు, ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలు, కమిషన్ ఛైర్మన్లు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు బీసీల కులగణన గురించి చేస్తున్న విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. బీసీల గురించి మాట్లాడే హక్కు ఆ రెండు పార్టీలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణనపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు.
Latest news,Telugu news,Telangana news,Politics news