Nsnnews// కామారెడ్డి జిల్లా బీబీపేట మహాత్మా జ్యోతిబాపులే బాలుర వసతి గృహంలో సౌకర్యాలు కల్పిస్తూ…భవనాన్ని మరొక ప్రాంతానికి మార్చాలని..విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వసతి గృహంలో చదివే తమ పిల్లలకుసకల సౌకర్యాలు కల్పించాలంటూ…కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ధర్నాకు దిగారు. భారీ కేడ్లను దూసుకుని కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన..నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులకు వసతి గృహంలో వసతులు కల్పించకపోవడంపై..అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ బిల్డింగ్ మార్చకపోతే… హాస్టల్ విద్యార్థులతో కలిసి సచివాలయం ముట్టడించనున్నట్టు తెలిపారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy District