NSN NEWS//
బిఆర్ఎస్ బ్రోకర్ వెంకట్ రామి రెడ్డి.
-కలెక్టర్గా కాదు కేసీఆర్ అనుచరుడుగా పనిచేశాడు
-అభివృద్ధి ముసుగులో బినామీ కంపెనీలతో కోట్ల రూపాయలు దొబ్బి
-మతం పేరుతో కల్లోలానికి బిజెపి కుట్ర
-మతతత్వ బిజెపికి బుద్ధి చెప్పాలి
-జగదేవపూర్ రోడ్ షో లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఫైర్
ది సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను పది సంవత్సరాలు కలెక్టర్ గా విధులు నిర్వహించానని గొప్పలు చెప్పుకుంటున్న వెంకట్రామారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షెపాయి గా పనిచేసాడని విమర్శించారు అభివృద్ధి పీరిటా ఆర్థిక విధ్వంసం జరిగిందని బినామీ కంపెనీలతో నిర్మాణ పనులు చేయించి కోట్ల రూపాయలు దండుకున్నారని సోమవారం రోజున జగదేవపూర్ మండల కొంద్రంలోని ఎల్లమ్మ టెంపుల్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో నిరంకుశంగా నిర్దాక్షంగా వ్యవహరించి పోలీసుల సహకారంతో పేద ప్రజల గూడుకొల్చి వారిని నిర్వాసితులు చేసిన వ్యక్తి వెంకటరామారెడ్డి అని విమర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా కాకుండా కెసిఆర్ కు అనుంగా అనుచరుడుగా వ్యవహరిస్తూ సప్పాయి పనిగా పనిచేసిన వ్యక్తి వెంకటరామిరెడ్డి అని ధ్వజమెత్తారు నీలం మధు. కలెక్టర్గా ఉన్నప్పుడే పేద ప్రజల జీవితాలను వినాశనం చేసిన వ్యక్తి నేడు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని ప్రజలు వారి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మతం పేరుతో విభజించి ఓట్లు దండుకోవాలని కుటీర ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ యోచిస్తుందని అలాంటి పార్టీని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం నుండి మాజీ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ని గెలిపించి దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఘనత మెదక్ కె దక్కుతుందని అన్నారు. అలాంటి నియోజకవర్గంలో నన్ను గెలిపించి అదే పరంపరను కొనసాగించాలని ఆయన కోరారు .పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ ,సబ్సిడీ ద్వారా అందిస్తున్న సిలిండర్ని అందిస్తున్నామన్నారు .అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం 6 గ్యారంటీలు తీసుకువచ్చి పేద ప్రజల కుటుంబాలు జ్యోతులు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గం లో అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టించిన వెంకట్రామిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి లో వెంకటరామిరెడ్డి బినామీలుగా పనిచేశారని నీలం ఆరోపించారు .వెంకటరామిరెడ్డి మొదటి నుండి కలెక్టర్ ముసుగులో బిఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలు కూడా పెట్టారని మధు ఆరోపించారు .తనను గెలిపిస్తే మెదక్ పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని నీలం మధు అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ,ఎలక్షన్ రెడ్డి, మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు