Nsnnews// బాసర ఆర్జీయూకేటీ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు బాసర ఎస్ఐ గణేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం బాసర నుంచి భైంసా వైపు వెళ్తున్న బైక్ ను వెనుకాల నుంచి కారు ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామానికి చెందిన విజయ్, లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. క్షేతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Latestnews, Telugunews, Telangananews, Basara, Road accident..