Nsnnews// సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురవన్నపేటకు చెందిన బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనపై…సీపీ అనురాధ మీడియాకు వివరాలు వెల్లడించారు. గురవన్నపేటకు చెందిన ఇంటి పక్కన గల జెసిబి డ్రైవర్..బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు చెప్పారు. ఘటనపై..రాత్రి బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో..కేసు నమోదు చేసి, నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్టు సీపీ తెలిపారు. నిందితున్ని విచారించి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. దాడిలో తీవ్ర రక్త స్రావమైన బాలికను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై.. ఫోక్సోకేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఆందోళనలో నిందితుడి ఆస్తులను ధ్వంసానికి పాల్పడిన పలువురు గ్రామస్తులపై కేసులు నమోదు చేశామన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news