Nsnnews// రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్లలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నామాపూర్ గ్రామానికి చెందిన సల్కం మనోజ్ఞ (4) మహర్షి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.ఉదయం స్కూల్ ఆవరణలో చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా.. డ్రైవర్ పాపను గమనించకుండానే వ్యాన్‌ను రివర్స్ తీశాడు. అయితే, ఒక్కసారిగా వ్యాన్ రివర్స్ వచ్చి పాపను ఢీకొట్టడంతో ఆమె తలపైకి వ్యాన్ టైర్లు వెళ్లడంతో తల ఛిద్రమైంది. దీంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. తమ కూతురు మరణాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పాఠశాల నిర్వాహకుడు రామ్మోహన్ విదేశాల్లో ఉండి ఇక్కడి పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి అనార్థం జరిగిందని మృతురాలి బంధువులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని,బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పలు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి.దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దిగొచ్చిన జిల్లా విద్యాధికారి రమేష్…పాఠాశాలకు సీల్ వేసి సీజ్ చేశారు.
Latest news,Telugu news,Sirisilla news,Telangana news,Crime news