*బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బి.ఈశ్వర్*
*బీఫామ్ అందుకుంటున్న ఈశ్వర్*
బహుజన్ సమాజ్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామానికి చెందిన బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడపాట్ల ఈశ్వర్ గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ ,రాజ్యసభ ఎంపీ మరియు కేంద్ర సమన్వయకర్త మంతాపురం బాలయ్య, రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు బుధవారం మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వర్ గారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని పని చేస్తూ పార్టీ ఏ ఆదేశం ఇచ్చిన దాన్ని ముందుకు తీసుకుపోతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఎస్పీ పార్టీని బలపరుస్తూ తనకు ఈ అవకాశం ఇచ్చిన జాతీయ సమన్వయకర్త రాంజీ గౌతమ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ. బీఎస్పీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తనకు ఈ అవకాశం రావడం కోసం సహకరించిన రాష్ట్ర, వివిధ జిల్లాల అసెంబ్లీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఎస్పీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.
తేదీ 25 గురువారంరోజున మెదక్ కలెక్టర్ కార్యాలయంలో, పార్టీ కార్యకర్తలతో కలసి నామినేషన్ వేస్తానని కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.