Nsnnews// మహారాష్ట్ర బద్లాపూర్ లో.. నర్సరీ చదివే ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు.. అక్షయ్ షిండే పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి బద్లాపూర్..తరలిస్తుండగా నిందితుడు తుపాకీ లాక్కుని ఇన్ స్పెక్టర్ ను కాల్చేందుకు యత్నించినట్టు అధికారులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం మరో పోలీసు నిందితుడిని కాల్చినట్లు…సీఎం ఏక్ నాథ్ శిందే ప్రకటించారు. అయితే ఈ ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకే ప్రభుత్వం నిందితుడిని కాల్చిచంపిందని విపక్షాలు ఆరోపించాయి. సంకెళ్లు వేసిన తర్వాత.. తుపాకి ఎలా లాక్కున్నాడని ప్రశ్నించాయి. ఈ కాల్పుల ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
Latest news,Telugu news,National news,Crime news