Nsnnews// బతుకమ్మవేడుకల నేపధ్యంలో…సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎర్రచెరువు వద్ద ఏర్పాట్లు చేయాలని స్థానిక మహిళలు కోరారు. బతుకమ్మ సంబరాల దృష్ట్యా.. అసౌకర్యం కల్గకుండా…లైటింగ్, సుందరీకరణ పనులు చేపట్టాలని..మహిళలు, ప్రజలు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి, ఏర్పాట్లపై స్పందించాలని కోరితే..నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారన్నారని ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్‌ను బద్నాం చేయాలనే ఆలోచనతో అధికారులు వ్యవహారిస్తున్నారన్నారు. ఇప్పటీకైనా…మున్సిపల్ అధికారులు స్పందించి, ఏర్పాట్లు చేయాలన్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news