Nsnnews// వర్గీకరణకు వ్యతిరేకంగా… ఎస్సీ ఎస్టీ ఉపకులాలు ఈనెల 21న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో… ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో… భారత్ బంద్ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి కన్వీనర్లు దారస్వామి, మద్దెల రాజేష్ మాట్లాడారు. కొందరూ తమ రాజకీయ స్వార్ధం కోసం…భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు కల్పించిన హక్కులను కాలరాసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పేరిట…కోర్టులలో కేసులు వేసి, రాష్ట్రాలకు వర్గీకరణ హక్కులు కల్పించేందుకు కోర్టు తీర్పులను ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉన్న నాయకులకు… తగిన గుణపాఠం చెప్పేందుకు వెనకడబోమన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news