Home అంతర్జాతీయం బంగ్లాదేశ్‌ సంక్షోభం.. నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు! || Bangladesh crisis.. countries of the world are closely watching!

బంగ్లాదేశ్‌ సంక్షోభం.. నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు! || Bangladesh crisis.. countries of the world are closely watching!

0
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు! || Bangladesh crisis.. countries of the world are closely watching!

 

Nsnnews// వాషింగ్టన్‌: బంగ్లాదేశ్‌లో పరిస్థితులను  నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని సూచించింది. సైన్యం చొరవ తీసుకొని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు.

గతకొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో పలువురు మరణించడంపై అమెరికా విచారం వ్యక్తంచేసింది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాత, పారదర్శక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది. మరిన్ని ఘర్షణలు జరగకుండా అన్నిపక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.

బంగ్లా ప్రజల పక్షానే ఉన్నాం: ఐరాస
ప్రధాని షేక్‌హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. నిరసన తెలియజేసే హక్కును కాపాడాలని పిలుపునిచ్చింది. తాము బంగ్లాదేశ్‌ సామాన్య ప్రజల పక్షానే ఉన్నామని పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన ఘటనలపై దర్యాప్తు జరపాలని కోరింది. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటామని తెలిపింది.

త్వరగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి: యూకే
బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉందని యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అభిప్రాయపడింది. అక్కడ జరిగిన హింసాత్మక ఘర్షణలపై విచారం వ్యక్తంచేసింది. బంగ్లాదేశ్‌లోని సామాన్య పౌరులకు భద్రత, శాంతియుతమైన పాలనను అందించాలని ఆకాంక్షించింది. ఇప్పటి వరకు జరిగిన ఘటనలపై ఐరాస నేతృత్వంలో విచారణ జరగాలని డిమాండ్ చేసింది. మరోవైపు హసీనా లండన్‌లో ఆశ్రయం కోరనున్నారనే వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీనిపై మాత్రం యూకే ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడికిన బంగ్లాదేశ్‌ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్‌ హసీనా ప్రభుత్వం వైదొలగింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్‌కు వచ్చారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నట్లు సైనికాధిపతి జనరల్‌ వకార్‌-ఉజ్‌-జమాన్‌ ప్రకటించారు.

Latest news,Telugu news,International News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here