Home క్రైమ్ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..

0
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..

 

Nsnnews// తిరుపతన్న, భుజంగరావు బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ ఫోన్ ట్యాపింగ్‌ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషినల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తికాగా.. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Latest news,Telugu news,Phone tapping case…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here