Nsnnews// సిద్దిపేట: కారు ఢీకొని ఒకరూ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే…సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన చిలుముల శ్రీనివాస్ అనే వ్యక్తి, పాలు తీసుకుని సేలంపుకు వెళ్తుండగా.. దర్గా గ్రామానికి సమీపంలోని మూలమలుపు వద్ద అటుగా వస్తున్న ఫార్చునర్ కారు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
latest news,Telugu news ,Telangana news,Crime news…