Nsnnews// సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం తీవ్ర దుమారం రేపింది. ప్రోటోకాల్ ఉల్లంఘన ఘటనపై.. సిద్దిపేట కలెక్టర్, పోలీస్ కమిషనర్ కు..దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. చెక్కుల పంపీణీలో ఘర్షణకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని..కలెక్టర్, సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోని యేడల..న్యాయ పోరాటం చేస్తామని.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి తెలిపారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news