Nsnnews// హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. బీహెచ్ఎల్ డిపో నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడ వెళ్లేందుకు కొత్తగా రెండు ఎలక్ట్రిక్ గరుడ బస్సులను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల కోసం కొత్తగా ఎలక్ట్రిక్ గరుడ బస్సులను ప్రవేశపెట్టింది. రామచంద్రాపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియన్ టౌన్షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మైహోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడ వెళ్తాయన్నారు. దీంతో విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ జామ్ నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ప్రతిరోజూ రాత్రి 9:30, 10:30కు రామచంద్రాపురం నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీలత విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కొన్ని రోజులలో దసరా పండగ రాబోతోంది. దీంతో పండగను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఎక్కువ బస్సులను నడిపేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి 12వరకు జరగనున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్తుంటారు. ఇదే సమయంలో పాఠశాలలకు, కాలేజీలకు దసరా సెలవులు ఉన్నందున వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. దీంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 3నుంచి 15వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తెలియజేశారు.
Latest news,Telugu news,Telangana news,Hyderabad news