Nsnnews// సిద్దిపేట జిల్లా కేంద్రం ఖాదర్‌పురా నసీర్‌నగర్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతుల పేరిట నడిరోడ్డుపై నిలబెట్టారు. అది కూడా అత్యంత ప్రమాదకరంగా చిన్నచిన్న రాళ్లపై ఉంచారు. నాలుగునెలలు కావొస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాలనీవాసులు ఇదే విషయాన్ని ఏఈ కొమురయ్య దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపాల్టీ నుంచి ల్యాడర్ అనుమతి తీసుకొస్తే.. మరమ్మతులు చేస్తామని చెబుతున్నాడు కొమురయ్య. ఎక్కడ చెప్పుకున్నా సరే.. మేం చేసేదేమి లేదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నాడు. ఏఈ కొమురయ్య నిర్లక్ష్యపు వ్యాఖ్యలపై కాలనీవాసులు మండిపడుతున్నారు.
Latest news,Telugu news,Telangana news,Siddipet news,Crime news…