Nsnnews// ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఆధారంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ ను పౌరసరఫరాల సంస్థకు అప్పగించనంది. మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడం చెల్లదంటూ… హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు పంపిందని, కొంత బియ్యాన్ని వారు ప్రభుత్వానికి సరఫరా చేశారన్నారు. ఈ ధాన్యానికి అనుగుణంగా బియ్యం వారి వద్ద లేదని.. కలెక్టర్ల తనిఖీలో తేలిందన్నారు. మిల్లర్ల నుంచి 70 కోట్ల నుంచి 90 కోట్ల దాకా ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. మిల్లర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… రెవెన్యూ రికవరీ చట్టం కింద ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. అంతేకాకుండా ఒప్పందంలో ఆర్బిట్రేషన్ నిబంధన ఉన్నపుడు… రెవెన్యూ రికవరీ చట్టాన్ని వినియోగించజాలదన్నారు. రెండో పార్టీ ఒక్కటే తప్పు జరిగిందని నిర్ణయించజాలదన్నారు. వివాదాన్ని స్వతంత్ర సంస్థ పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.
latestnews, telugunews, poiticalnews, telangananews….