Nsnnews// హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి ప్రభాస్ ఇంటికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా, అభిమానులు వాగ్వాదానికి దిగారు. అనంతరం ప్రభాస్ ను కలవాలంటూ వారంతా రోడ్డుపై బైఠాయించడంతో చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Latest news, Telugu news, Telangana news, Hyderabad news..