Nsnnews// ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రపంచమంతా కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా… భారత్ శతాబ్ధి గురించి ఆలోచిస్తున్నారంటూ.. సమ్మిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. భారత్ ప్రతీ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని..ప్రధాని మోడీ అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 125 రోజులు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ఈ మేరకు ఈ సమయంలో మా ప్రభుత్వ అనుభవాన్ని అందరితో పంచుకుంటాన్నట్టు చెప్పారు. పేదలకు 3 కోట్ల కొత్త నివాసాలను ఇచ్చామని, 9లక్షల కోట్ల ఇన్ఫా ప్రాజెక్టులపై పని మొదలైందన్నారు. ఇప్పటికే 15 వందేభారత్ రైళ్లు ప్రారంభించామని, 8 కొత్త ఎయిర్ పోర్టుల పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు ప్రధాని. యువతకు 2లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని, రైతుల ఖాతాలకు 21వేల కోట్లను బదిలీ చేశామన్నారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేశామని, 5 లక్షల ఇళ్లల్లో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్టాక్ మార్కెట్ సూచీల్లో దాదాపు 7 శాతం వృద్ధి నమోదైందన్నారు. విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్ డాలర్లకు దాటేసిందన్నారు. ఈ అభివృద్ధి 125 రోజుల్లో జరిగిందేనని అన్నారు.ఈ సమయంలో భారత్‌లో ప్రపంచం మూడు విషయాలు చర్చించడానికి వచ్చిందన్నారు. టెలికామ్ డిజిటల్ ప్యూచర్‌పై అంతర్జాతీయ అసెంబ్లీ జరిగిందన్నారు. ఈ మేరకు గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ నిర్వహించారు. గ్లోబల్ సెమి కండెక్టర్ ఎకోసిస్టమ్ పై సదస్సు జరిగిందన్నారు. ఈ సమావేశాలు భారత్ దిశ.. ప్రపంచం దిశను తెలియజేస్తున్నాయన్నారు.
latestnews, telugunews, nationalnews…