Nsnnews// ప్రపంచ కుబేరుల జాబితాలో మెటా CEO మార్క్ జుకర్ బర్గ్…తొలిసారి రెండో స్థానానికి చెరుకున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్-బెజోస్ ను దాటి…రెండో స్థానానికి దూసుకెళ్లారు. ఈ విషయాన్ని…బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. బ్లూమ్ బర్గ్ ప్రకారం జుకర్ బర్గ్ సంపద 206 బిలియన్ డాలర్లుగా ఉండగా…జెఫ్ బెజోస్ సంపద…205 బిలియన్ డాలర్లుగా చూపిస్తోంది. ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్…256 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ 107 బిలియన్ డాలర్ల సంపదతో 14వ స్థానంలో ఉండగా…100 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ17వ స్థానంలో ఉన్నారు. ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి. రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదవ్వడంతో పాటు…AI చాట్ బాట్ లను మరింత శక్తివంతంగా మార్చేందుకు.. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు 23 శాతం పెరిగాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్ సెషన్ లో సంస్థ షేరు విలువ ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకి 582.77 డాలర్ల వద్ద ముగిసింది. AI రేసులో ముందంజలో నిలిచేందుకు.. డేటా సెంటర్ లు, కంప్యూటింగ్ పవర్ పై మెటా పెద్ద ఎత్తున డబ్బుల్ని వెచ్చిస్తోంది. తాజాగా “ఓరియన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్”ను కూడా పరిచయం చేసింది.
Latest news,Telugu news,Business news